నందితా శ్వేత ‘ఐపీసీ 376’కు భారీ ఆఫర్స్

ABN , First Publish Date - 2020-07-27T22:57:48+05:30 IST

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్‌పై ఎస్. ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘ఐపీసీ 376’. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం

నందితా శ్వేత ‘ఐపీసీ 376’కు భారీ ఆఫర్స్

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్‌పై ఎస్. ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘ఐపీసీ 376’. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో తెరకెక్కింది. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. హారర్ర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఆకట్టుకునేలా ట్రైలర్ ఉంది. అంతే కాదు ట్రైలర్ రిలీజైన వెంటనే అటు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి మూవీ ఆఫీస్‌కు బిజినెస్ కోసం ఆఫర్లు వస్తున్నాయని చిత్ర నిర్మాత తెలుపుతున్నారు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం కాల్స్ వస్తుండటం సంతోషంగా ఉందంటున్నారు మేకర్స్. త్వరలోనే ఒక మంచి డీల్ ఫిక్స్ చేసి బిజినెస్ క్లోజ్ చేస్తామంటున్నారు నిర్మాత ప్రభాకర్.


ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు ఎలాంటి సవాళ్లు విసిరాయి? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నందితా శ్వేత నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకంటున్న ఈ మూవీ థియేటర్లు ఓపెన్ అవ్వగానే రిలీజ్ కానుంది.

Updated Date - 2020-07-27T22:57:48+05:30 IST

Read more