వెంకీ-త్రివిక్రమ్ సినిమా.. నిర్మాత స్పందన!

ABN , First Publish Date - 2020-09-07T16:49:35+05:30 IST

మూడు దశాబ్దాల క్రితం కెరీర్ ప్రారంభించిన `విక్టరీ` వెంకటేష్ ఇప్పటికీ అదే జోష్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు

వెంకీ-త్రివిక్రమ్ సినిమా.. నిర్మాత స్పందన!

మూడు దశాబ్దాల క్రితం కెరీర్ ప్రారంభించిన `విక్టరీ` వెంకటేష్ ఇప్పటికీ అదే జోష్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్వరలో మరో మైలురాయికి చేరువ కాబోతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో `నారప్ప` సినిమా చేస్తున్నారు. ఇది వెంకీ కెరీర్‌లో 74వ సినిమా. 


వెంకీ 75వ సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా రూపొందిస్తారని వార్తలు వస్తున్నాయి. వెంకీ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటన వచ్చింది. అది వెంకీ 75వ సినిమానే అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. `వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లోని సినిమా గురించి మీ ఆసక్తిని అర్థం చేసుకోగలం. అయితే వెంకీ 75వ సినిమా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా తర్వాతి ప్రాజెక్టు గురించి మా అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ప్రకటిస్తాం. అప్పటివరకు వేచి ఉండండ`ని ట్వీట్ చేశాడు. 
Updated Date - 2020-09-07T16:49:35+05:30 IST