సర్జా హఠాన్మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది: నిర్మాత

ABN , First Publish Date - 2020-06-08T02:49:11+05:30 IST

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ రోజు(ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. సడెన్‌గా

సర్జా హఠాన్మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది: నిర్మాత

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ రోజు(ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. సడెన్‌గా గుండెపోటు రావడంతో బంధువులు అతనిని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే చిరంజీవి సర్జా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా హఠాన్మరణం మమ్మల్ని తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసిందని పీపుల్ మీడియా అధినేత టి.జి.విశ్వప్రసాద్ అన్నారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలుగులోనే కాక కన్నడ నాట కూడా తమ సంస్థ చిత్రనిర్మాణాన్ని చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే సర్జా హీరోగా చైతన్య దర్శకత్వంలో తాము నిర్మించిన ఆద్య చిత్రం ఈ ఏడాది శివరాత్రి పర్వదినాన విడుదలై హీరోకు, మా సంస్థకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ జ్ఞాపకాల పచ్చదనం తడి ఆరకముందే ఈరోజు (ఆదివారం) ఈ వార్త మా మనసులను కలచి వేసింది. సర్జా ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మా సంస్థ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని తెలిపారు.Updated Date - 2020-06-08T02:49:11+05:30 IST