నిర్మాత పీడీవీ ప్రసాద్‌కు సతీవియోగం
ABN , First Publish Date - 2020-11-07T05:16:03+05:30 IST
ప్రముఖ నిర్మాత పీడీవీ ప్రసాద్ సతీమణి అంజూ ప్రసాద్ (53) శుక్రవారం గుండె పోటుతో కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.....

ప్రముఖ నిర్మాత పీడీవీ ప్రసాద్ సతీమణి అంజూ ప్రసాద్ (53) శుక్రవారం గుండె పోటుతో కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పీడీవీ ప్రసాద్, అంజు దంపతులకు ఇద్దరు పిల్లలు. పీడీవీ ప్రసాద్ ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థలు హారిక హాసిని నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీమతి అంజు అంత్యక్రియలు శనివారం జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు.