సీనియర్ నిర్మాత కన్నుమూత
ABN , First Publish Date - 2020-07-27T18:32:32+05:30 IST
సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి 8 గంటల 50 నిమిషాలకు గుండెపోటుతో బెంగుళూరులో కన్నుమూశారు.

సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి 8 గంటల 50 నిమిషాలకు గుండెపోటుతో బెంగుళూరులో కన్నుమూశారు. సత్యనారాయణ మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతగా పాండు రంగ మహత్యం అనే డబ్బింగ్ సినిమాను రూపొందించారు సత్యనారాయణ. ఆ తర్వాత తెలుగులో కొంగుముడి, శ్రీవారు, దొరగారింట్లో దొంగోడు, మాయామోహిని తదితర చిత్రాలను నిర్మించారు.
Read more