ప్ర‌భుదేవా, న‌య‌న‌తార కాంబోపై నిర్మాత క్లారిటీ..!

ABN , First Publish Date - 2020-06-05T15:24:34+05:30 IST

రెండేళ్ల క్రితం ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో విశాల్‌, కార్తి హీరోలుగా ‘క‌రుప్పు రాజా వెళ్లై రాజా’ అనే సినిమా స్టార్ట్ అయ్యింది. అనివార్య కార‌ణాల‌తో సినిమా ఆగిపోయింది.

ప్ర‌భుదేవా, న‌య‌న‌తార కాంబోపై నిర్మాత క్లారిటీ..!

రెండేళ్ల క్రితం ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో విశాల్‌, కార్తి హీరోలుగా ‘క‌రుప్పు రాజా వెళ్లై రాజా’ అనే సినిమా స్టార్ట్ అయ్యింది. అనివార్య కార‌ణాల‌తో సినిమా ఆగిపోయింది. ఈశ్వ‌రి కె.గ‌ణేశ్ ఈ చిత్రానికి నిర్మాత‌. తాజాగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌ని ఇందులో ప్ర‌భుదేవా, న‌య‌న‌తార కూడా న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల‌పై నిర్మాత ఈశ్వ‌రి కె.గ‌ణేశ్ వివ‌ర‌ణ ఇచ్చారు. ‘‘ ‘క‌రుప్పు రాజా వెళ్లై రాజా’ చిత్రంలో ప్ర‌భుదేవా, న‌య‌న‌తార కలిసి న‌టిస్తార‌ని విన‌ప‌డుతున్న వార్త‌ల్లో నిజం లేదు. ‘క‌రుప్పు రాజా వెళ్లై రాజా’ చిత్రం అనివార్య కార‌ణాల‌తో ఆగిపోయింది. ఆ సినిమాను పూర్తి చేయాల‌ని ఉద్దేశం నాకు ఇప్పుడు లేదు’’ అన్నారు. 


Updated Date - 2020-06-05T15:24:34+05:30 IST