‘ఫైట‌ర్’ ఫైనల్ కాదు.. వ‌ర్కింగ్ టైటిలే: ఛార్మీ

ABN , First Publish Date - 2020-07-19T04:55:09+05:30 IST

ఇప్పుడు నా దృష్టి నటన మీద లేదు. ఇకపై నటించదలుచుకోలేదు. ప్రస్తుతం నా దృష్టంతా ప్రొడక్షన్ మీదే ఉంది అంటూ ఆ మధ్య ఛార్మీ తెలిపిన విషయం గుర్తుండే

‘ఫైట‌ర్’ ఫైనల్ కాదు.. వ‌ర్కింగ్ టైటిలే: ఛార్మీ

ఇప్పుడు నా దృష్టి నటన మీద లేదు. ఇకపై నటించదలుచుకోలేదు. ప్రస్తుతం నా దృష్టంతా ప్రొడక్షన్ మీదే ఉంది అంటూ ఆ మధ్య ఛార్మీ తెలిపిన విషయం గుర్తుండే ఉంటుంది. చెప్పినట్లుగానే ఆమె డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ అనే సంస్థను స్థాపించి సినిమాలను పూరీతో కలిసి ప్రొడ్యూస్ చేస్తుంది. రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం వీరి కాంబినేషన్‌కు హిట్‌ని, అలాగే వీళ్ల బ్యానర్‌కు మంచి నేమ్‌ని తీసుకువచ్చింది. ఇప్పుడు వీరు బాలీవుడ్‌లో ఓ సంస్థతో కలిసి పాన్ ఇండియా ఫిల్మ్‌ను చేస్తున్నారు. అందులో హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా టైటిల్ విషయమై ఇప్పటికే కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ఆ కన్ఫ్యూజన్‌కు తాజాగా ఛార్మీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.


ఆమె మాట్లాడుతూ.. ‘‘విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాధ్‌గారు చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్‌కు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి అన్ని భాషలకు సరిపోయేలా టైటిల్ పెట్టాలని పూరీగారు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి వినిపిస్తున్న ‘ఫైటర్’ అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ మాత్రమే. త్వరలోనే టైటిల్‌ను పూరీగారు ప్రకటిస్తారు..’’ అని తెలిపింది. అయితే ఈ చిత్రానికి ‘ఫైటర్’తో పాటు ‘లైగర్’ అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. మరి చివరికి పూరీ ఏది ఫైనల్ చేస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Updated Date - 2020-07-19T04:55:09+05:30 IST