ప్రియాంక హాట్ ఫన్నీ పోస్ట్.. వైరల్!

ABN , First Publish Date - 2020-05-25T17:39:59+05:30 IST

`ఎక్స్‌పెక్టేషన్ వెర్సస్ రియాలిటీ` అంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రియాంక హాట్ ఫన్నీ పోస్ట్.. వైరల్!

`ఎక్స్‌పెక్టేషన్ వెర్సస్ రియాలిటీ` అంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా తరచుగా తన హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటుంది. 


ప్రస్తుతం లాస్‌ఏంజెలెస్‌లో ఉంటున్న ప్రియాంక తాజాగా రెండు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొదటి ఫొటోలో పింక్ బికినీ, దాని మీద షర్టు ధరించి హాట్‌గా, స్టైలిష్‌గా ఉంది. ఇక, రెండో ఫొటోలో కింద పడుకుని మొహం మీద తెల్లని వస్త్రం కప్పుకుని ఉంది. దీనికి  `ఎక్స్‌పెక్టేషన్ వెర్సస్ రియాలిటీ` అని కామెంట్ జత చేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితిపై ప్రియాంక ఇలా ఫన్నీగా కౌంటర్ వేసింది. ప్రియాంక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామన్యులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ప్రియాంక పోస్ట్‌పై కామెంట్లు పెడుతున్నారు. 
Updated Date - 2020-05-25T17:39:59+05:30 IST

Read more