లాక్‌డౌన్‌లో ప్రియాంక... మాస్క్‌తో సెల్ఫీ!

ABN , First Publish Date - 2020-05-12T17:24:37+05:30 IST

బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. కరోనా వైరస్ యుఎస్‌లోనూ త‌న ప్ర‌తాపం చూపిస్తున్న విష‌యం విదిత‌మే.

లాక్‌డౌన్‌లో ప్రియాంక... మాస్క్‌తో సెల్ఫీ!

బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. కరోనా వైరస్ యుఎస్‌లోనూ త‌న ప్ర‌తాపం చూపిస్తున్న విష‌యం విదిత‌మే. అక్క‌డ లాక్‌డౌన్ కార‌ణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండ‌వ‌ల‌సి వ‌స్తోంది. ఈ లాక్‌డౌన్‌లో ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ,  ప‌లు విష‌యాలు షేర్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా రెండు నెలల తర్వాత ఇంటి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మాస్క్ ధరించి సెల్ఫీ తీసుకుని, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటానికి నిధుల సేకరణకు చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో ప్రియాంక  తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-12T17:24:37+05:30 IST