లేడీ గాగాకు ధన్యవాదాలు తెలిపిన ప్రియాంకా చోప్రా

ABN , First Publish Date - 2020-04-20T22:46:38+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందకు విరాళాల సేకరణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబెల్ సిటిజన్, మరియు ప్రముఖ సింగర్ లేడీ గాగా సంయుక్తంగా

లేడీ గాగాకు ధన్యవాదాలు తెలిపిన ప్రియాంకా చోప్రా

న్యూయార్క్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందకు విరాళాల సేకరణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబెల్ సిటిజన్, మరియు ప్రముఖ సింగర్ లేడీ గాగా సంయుక్తంగా నిర్వహించిన ‘వన్ వరల్డ్ : టూగెదర్ ఎట్ హోమ్’ అనే వర్చువల్ కాన్సర్ట్‌లో తనను భాగస్వామ్యం చేసుకున్నందుకు నటి ప్రియాంకా చోప్రా ధన్యవాదాలు తెలిపింది. 


‘‘గత రాత్రి వన్ వరల్డ్‌లో భాగస్వామిని కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గ్లోబల్ సిటిజన్, లేడీ గాగాకు నా ధన్యవాదాలు, మరియు దీని ద్వారా 127 మిలియన్ డాలర్ల విరాళంగా సేకరించినందుకు అభినందనలు’’ అంటూ ప్రియంకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 


‘‘కరోనాపై పోరాటం చేస్తున్ వైద్య సిబ్బందికి, ఇతర కార్మికులకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. మీరు చూపిస్తున్న మనవత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటాము’’ అని ప్రియాంకా పేర్కొంది. 


ఇక తన ట్విట్టర్ ఖాతాలో తన ప్రదర్శనకు సంబంధించి ప్రియాంకా కొన్ని వీడియోలను పోస్ట్ చేసింది. అంతేకాక.. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభం కారణంగా నిరాశ్రయులు ఎదురుకుంటున్న కష్టాలను ప్రియాంకా ప్రస్తావించింది. కేవలం అమెరికాలోనే 17 మిలియన్ల మంది నిరాశ్రయులు ఉన్నారని చెప్పిన ప్రియాంక.. వాళ్లు పారిశుద్ధ్యం, వైద్యం, శుభ్రమైన నీరు వంటి కనీస వసతులు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. చాలా క్యాంపుల్లో ఆశ్రయం లేని వాళ్లు గుంపులుగా జీవించాల్సి వస్తుందని తెలిపింది. 


ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్ సిటిజన్ సంస్థ చొరవ తీసుకొని.. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వీరికి అండగా నిలుస్తున్నాయని చెప్పిన ప్రియాంక.. ఆ రెండు సంస్థలను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నిరాశ్రయులను ఒంటరిగా వదిలేయకుండా ప్రతీ ఒక్కరు అండగా ఉండాలని.. పిలుపునిచ్చింది.

Updated Date - 2020-04-20T22:46:38+05:30 IST