అస్సోంలో వరదలు.. ప్రియాంక, నిక్ సాయం
ABN , First Publish Date - 2020-07-27T18:58:45+05:30 IST
అస్సోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు గ్రామాలు నీట మునిగాయి. భారీగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కోవిడ్ 19 మన దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్‌తో పాటు వరదలు కూడా ప్రజలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అస్సోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు గ్రామాలు నీట మునిగాయి. భారీగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగింది. బ్రహ్మపుత్ర నదికి వరద పెరగడంతో కాజీరంగ జాతీయ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఎనబై శాతం నీట మునిగింది. అస్సోంలోని ప్రజలకు చేయూతను అందించడానికి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ ముందుకు వచ్చారు.
‘‘అస్సోంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంక్షోభం నెలకొంది. లక్షల మంది రోడ్డున పడ్డారు. వన్యప్రాణి సంరక్షణా కేంద్రం నీట మునిగింది. ఇలాంటి సమయంలో అక్కడి ప్రజలకు మన అవసరం ఎంతో ఉంది. అస్సోంలో పనిచేస్తున్న కొన్ని సంస్థలకు మేం విరాళాలు అందించాం. వారు అక్కడి ప్రజలకు సాయం అందిస్తారు’’ అని ప్రియాంక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రియాంక, జోనాస్‌ల ఔదార్యానికి నెటిజన్స్ వారిని ప్రశంసిస్తున్నారు.
Read more