నువ్వు ఎంత బాధ అనుభవించావో: ప్రియాంక

ABN , First Publish Date - 2020-06-16T03:14:28+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీవ్ర మానసిక వేదనతో బాధపడుతూ‌

నువ్వు ఎంత బాధ అనుభవించావో: ప్రియాంక

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీవ్ర మానసిక వేదనతో బాధపడుతూ‌ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది సేపటి క్రితం ముంబైలోని విలే పార్లే వద్ద పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సుశాంత్ మృతి పట్ల గ్లోబల్ స్టార్ ప్రియాంక తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సుశాంత్ మరణానికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంతాపం తెలిపింది. 


`సుశాంత్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. నువ్వు ఎంత బాధను అనుభవించి ఉంటావో. నువ్వెక్కడున్నా ప్రశాంతంగా ఉంటావని ఆశిస్తున్నా మై ఫ్రెండ్. చాలా త్వరగా వెళ్లిపోయావు.  సూర్యోదయం వేళలో ఆస్ట్రోఫిజిక్స్‌ గురించి మన చర్చలను ఎప్పటికీ మర్చిపోలేను. సుశాంత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ భారీ నష్టం నుంచి అందరూ త్వరగా బయటపడాల`ని ప్రియాంక పోస్ట్ చేసింది. 

Updated Date - 2020-06-16T03:14:28+05:30 IST