ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ మూవీ

ABN , First Publish Date - 2020-10-28T21:21:33+05:30 IST

బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఓ హాలీవుడ్ మూవీలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు.

ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ మూవీ

బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఓ హాలీవుడ్ మూవీలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. 2016లో విడుదలైన జర్మన్‌ మూవీ 'ఎస్‌ఎంఎస్‌ ఫర్‌ డిచ్‌' రీమేక్‌లో ప్రియాంక నటించనున్నారు. ఈ సినిమా టెక్ట్స్‌ ఫర్‌ యు పేరుతో తెరకెక్కనుంది. ప్రియాంకకు నెటిజన్స్‌తో పాటు ఆమె భర్త నిక్‌ జోనస్‌ కూడా అభినందనలు తెలిపారు. సామ్‌ హ్యుఘన్‌తో ప్రియాంక నటిస్తున్నారు. జిమ్‌ స్ట్రౌజ్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. హీరోయిన్‌ ఓ ప్రమాదంలో తనకు కాబోయే భర్తను కోల్పోతుంది. బాధ నుండి కోలుకోడానికి చనిపోయిన బాయ్‌ఫ్రెండ్ సెల్‌ఫోన్‌కు శృంగార భరితమైన మెసేజ్‌లను పంపుతుంటుంది. అయితే ఆ సెల్‌ నెంబర్‌ను సదరు కంపెనీవారు మరో కస్టమర్‌కు కేటాయిస్తారు. అప్పుడు కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే సినిమా ప్రధాన కథాంశం. Updated Date - 2020-10-28T21:21:33+05:30 IST