రీ ఎంట్రీలో అదరగొడుతున్న ప్రియమణి

ABN , First Publish Date - 2020-09-08T00:34:05+05:30 IST

సౌత్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న జాతీయ ఉత్తమనటి ప్రియమణి. వైవిధ్యమైన కథలను

రీ ఎంట్రీలో అదరగొడుతున్న ప్రియమణి

సౌత్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న జాతీయ ఉత్తమనటి ప్రియమణి. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడమే కాకుండా, గ్లామర్‌గానూ తన సత్తా చూపించిందీ భామ. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గుడ్‌బై చెప్పిన ప్రియమణి, ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీకి రెడీ అయింది. రీ ఎంట్రీలో ఈ భామ ఇప్పుడు అదరగొడుతుంది. పెళ్లి తర్వాత హీరోయిన్‌లకు అవకాశాలు రావడం విషయంపై ఇప్పటికే టాలీవుడ్‌లో అనేకానేక కథలు వినిపిస్తున్నాయి. కానీ ప్రియమణికి మాత్రం అదృష్టం మాములుగా లేదు. పెళ్లి తర్వాత కూడా ఆమెకు మంచి మంచి పాత్రలు వస్తుండటం విశేషం.


ఇప్పటికే విక్టరీ వెంకటేష్‌ 'నారప్ప' చిత్రంలో సుందరమ్మగా నటిస్తున్న ప్రియమణి, మరో చిత్రం 'విరాటపర్వం'లో కామ్రేడ్‌ భారతక్కగా నటనకు అస్కారమున్న పాత్రలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలే కాకుండా బాలీవుడ్‌, కన్నడలో కూడా ఆమె చిత్రాలు చేస్తుంది. అలాగే 'ద ఫ్యామిలీ మెన్‌' సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌, బుల్లితెరపై 'ఢీ' షోతో బిజీబిజీగా ఉన్న ప్రియమణి.. ఇప్పుడు మరో చిత్రానికి సైన్‌ చేసింది. 'కొటేషన్‌ గ్యాంగ్‌' అనే టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో రూపుదిద్దుకోనుండటం విశేషం. 


ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనుందని చిత్రయూనిట్‌ ప్రకటించింది. 'శ్రీమన్నారాయణ, మిరపకాయ్, పైసా' వంటి సినిమాలను హిందీలో డబ్ చేసిన ఫిల్మీ నాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గాయత్రి సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలా దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన వివేక్.కె ఈ చిత్రానికి దర్శకుడు. ఓ స్టార్ హీరో ఇందులో కీలక పాత్ర పోషించనున్నారని, పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రయూనిట్‌ తెలిపింది.Updated Date - 2020-09-08T00:34:05+05:30 IST