ఐదు భాషల్లో ప్రియమణి చిత్రం

ABN , First Publish Date - 2020-12-08T21:24:53+05:30 IST

హీరోయిన్‌ ప్రియమణి, బేబీ సారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ షూటింగ్‌ ప్రారంభం ముంబాయిలో అట్టహాసంగా ప్రారంభమైంది.

ఐదు భాషల్లో ప్రియమణి చిత్రం

హీరోయిన్‌ ప్రియమణి, బేబీ సారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ షూటింగ్‌ ప్రారంభం ముంబాయిలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిల్మినాటి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ గాయత్రీ సురేశ్‌, గురుజ్యోతి ఫిలిమ్స్‌ జి.వివేకానందన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రెడ్‌రెయిన్‌ ఫేమ్‌ విష్ణు వారియర్‌, జీ ఫేమ్‌ అక్షయ, క్యారా, సోనాల్‌, కేథన్‌ కరాంతే, సదీందర్‌, షెరీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం సహా ఐదు భాషల్లో నిర్మి స్తున్నట్లు దర్శకుడు వివేక్‌ తెలిపారు. చక్కని కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని, ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ట్రైలర్‌ త్వరలో విడుదల చేస్తామని ఆయన వివరించారు.


Updated Date - 2020-12-08T21:24:53+05:30 IST