‘ప్రియదర్శి’ని అందరూ అదే అడుగుతున్నారట

ABN , First Publish Date - 2020-05-13T04:36:02+05:30 IST

కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేస్తూ విభిన్న నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే అతనని కమెడియన్ అనాలా? లేక క్యారెక్టర్

‘ప్రియదర్శి’ని అందరూ అదే అడుగుతున్నారట

కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేస్తూ విభిన్న నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే అతనని కమెడియన్ అనాలా? లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాలా? అనే డౌట్ ఇప్పుడందరిలో ఏర్పడింది. అయితే ఇదే విషయాన్ని ప్రియదర్శిని కూడా చాలా మంది అడుతున్నారట. ఈ విషయాన్ని ఆయన తన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ.. బిజీ యాక్టర్‌గా మారిన ప్రియదర్శి హీరోగానూ ‘మల్లేశం’ చిత్రంలో చేశారు. ఆ సినిమాలో అతని నటనకి అందరూ ఫిదా అయ్యారు. దీంతో అతనిని ఏమని పిలవాలి? అనే ప్రశ్న అందరిలో నెలకొంది.


అయితే దీనికి ప్రియదర్శి ఏమన్నారంటే.. ‘‘ఇదే ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడిగారు. మిమ్మల్ని ఏమని పిలవాలి అని? నావరకు నేను అన్ని రకాల పాత్రలు చేసి విభిన్నమైన నటుడిగా గుర్తింపు పొందాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ‘లూజర్’ అనే వెబ్ సిరీస్‌లో నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఏ పాత్ర చేసినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే అని నేను అనుకుంటూ ఉంటాను..’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-05-13T04:36:02+05:30 IST