మిల్కీబ్యూటీని ఢీ కొట్టనున్న బాలీవుడ్ భామ

ABN , First Publish Date - 2020-09-29T18:42:16+05:30 IST

ఇతర స్టార్‌ హీరోయిన్స్‌ను ఫాలో అవుతూ వెండితెరపై సందడి చేస్తున్న మిల్కీబ్యూటీ డిజిటల్‌ మాధ్యమంలోనూ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

మిల్కీబ్యూటీని ఢీ కొట్టనున్న బాలీవుడ్ భామ

తెలుగులో 'సీటీమార్‌, అంధాదున్‌ రీమేక్, గుర్తుందా శీతాలం' చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో 'బోల్‌ చూడియాన్‌' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు తమన్నా. అయితే ఇతర స్టార్‌ హీరోయిన్స్‌ను ఫాలో అవుతూ వెండితెరపై సందడి చేస్తున్న మిల్కీబ్యూటీ డిజిటల్‌ మాధ్యమంలోనూ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా కోసం డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు ఓ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నారు. '8 అవర్స్‌' పేరుతో తెరకెక్కబోయే ఈ వెబ్‌ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్స్‌ ఉంటాయట. ఈ వెబ్‌ సిరీస్‌లో తమన్నాను ఢీ కొట్టే ప్రతినాయిక పాత్రలో బాలీవుడ్‌ నటి ప్రియా బెనర్జీ నటించనున్నారట. ప్రియా బెనర్జీకి వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఈమె ఖాతాలో మరో వెబ్‌ సిరీస్‌ చేరింది. దీనికి ఆమె స్పందిస్తూ  "'8 అవర్స్‌' వెబ్‌ సిరీస్‌ నటిగా నన్ను ఆవిష్కరిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు నెక్ట్స్‌ డోర్‌ గర్ల్‌ పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చాను. నా పాత్రలో వేరియేషన్స్‌ చాలా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ ప్రియా బెనర్జీ తెలిపారు. 


Updated Date - 2020-09-29T18:42:16+05:30 IST