స్మాల్ స్ర్కీన్‌పైనా... పండగే

ABN , First Publish Date - 2020-04-02T21:47:42+05:30 IST

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో సంక్రాంతికి ముందు వచ్చిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. సాయి తేజ్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్ తదితరులు నటించిన

స్మాల్ స్ర్కీన్‌పైనా... పండగే

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో సంక్రాంతికి ముందు వచ్చిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. సాయి తేజ్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచి మంచి క్రేజ్‌ను ఏర్పరచుకుంది. మూవీ రిలీజ్ అయ్యాక ఆ క్రేజ్‌ను కంటిన్యూ చేస్తూ.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సాయి తేజ్ నటన, రావు రమేష్, సత్యరాజ్‌ల పెర్ఫార్మెన్స్, రాశీ ఖన్నా గ్లామర్ సినిమాకు పెద్ద విజయాన్ని అందించాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లు బలంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ని స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది.


తాజాగా ఈ చిత్రాన్ని ఆ ఛానెల్ ప్రసారం చేసింది. వెండితెరపై మంచి విజయం అందుకున్న ఈ చిత్రం బుల్లితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించి, మంచి టీర్పీని సొంతం చేసుకుంది. ఈ మూవీ 15.3 టీఆర్పీ రేటింగ్‌ని సొంతం చేసుకుంది. సాయితేజ్ గత చిత్రాలతో పోలిస్తే ది బెస్ట్ రేటింగ్ అందుకుందీ చిత్రం. అలాగే ఈ మధ్య కాలంలో మంచి టీఆర్పీని సాధించిన చిత్రంగా కూడా గుర్తింపును తెచ్చుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత.

Updated Date - 2020-04-02T21:47:42+05:30 IST