ప్రశాంత్ వర్మ ‘జాంబీ రెడ్డి’
ABN , First Publish Date - 2020-08-08T16:34:52+05:30 IST
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న మూడో చిత్రానికి ‘జాంబీ రెడ్డి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

తొలి చిత్రం ‘అ!’తో విమర్శకుల ప్రశంసలు, విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. రెండో చిత్రం ‘కల్కి’ అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ యువ దర్శకుడు తెరకెక్కిస్తోన్న మూడో చిత్రానికి ‘జాంబీ రెడ్డి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ప్రోమోను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. నిజ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యాపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు.