అందుకే ఆ మూవీకి దర్శకుడిగా నా పేరు లేదు: ప్రశాంత్ వర్మ

ABN , First Publish Date - 2020-07-12T04:05:30+05:30 IST

‘అ!’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు ప్రశాంత్ వర్మ. తన కథనం నచ్చి ఆ చిత్రాన్ని హీరో నాని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘కల్కీ’ అంటూ

అందుకే ఆ మూవీకి దర్శకుడిగా నా పేరు లేదు: ప్రశాంత్ వర్మ

‘అ!’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు ప్రశాంత్ వర్మ. తన కథనం నచ్చి ఆ చిత్రాన్ని హీరో నాని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘కల్కీ’ అంటూ రాజశేఖర్‌తో కూడా మంచి చిత్రాన్ని చేశారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. యంగ్ దర్శకుడిగా సక్సెస్ విషయంలో మంచి మార్కులే వేయించుకున్న ప్రశాంత్ వర్మ.. ఈ మధ్య చేసిన ఓ చిత్రానికి మాత్రం దర్శకుడిగా తన పేరు వేయించుకోలేదు. ఎందుకని మీరు దర్శకుడిగా పేరు వేయించుకోలేదు అని ఇటీవల ప్రశాంత్ వర్మకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఇచ్చిన సమాధానం ఆయన మాటల్లోనే..


‘‘హిందీ ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌ ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’కి దర్శకత్వం వహించిన మాట వాస్తవమే. కానీ ఆ చిత్రానికి సంబంధించి క్రెడిట్ నాకు ఇవ్వవద్దని నేనే చెప్పాను. ఆ సినిమాకి దర్శకత్వం చేయాలని నా దగ్గరకు వచ్చినప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. అందుకే క్రెడిట్ తీసుకోకూడదని అనుకున్నాను. నేను ఆ మిగిలిన షూటింగ్ చేయడానికి కారణం నిర్మాతే. నిర్మాత కోసమే డైరెక్ట్ చేశాను. క్రెడిట్ మాత్రం తీసుకోలేదు..’’ అని ప్రశాంత్ వర్మ తెలిపారు.

Updated Date - 2020-07-12T04:05:30+05:30 IST