ప్రణీత హార్స్‌ రైడింగ్‌

ABN , First Publish Date - 2020-10-30T20:46:43+05:30 IST

కోవిడ్‌ సమయంలో ఇబ్బందులు పడుతున్న వారికి తన వంతు సాయాన్ని అందించిన ప్రణీత, ఖాళీ సమయంలో హార్స్‌ రైడింగ్‌ నేర్చుకుంది.

ప్రణీత హార్స్‌ రైడింగ్‌

కోవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ఆరేడు నెలలు పాటు స్టార్స్‌ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడిపితే మరికొందరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నారు. అలా రెండో కోవకు చెందిన హీరోయిన్ ప్రణీత సుభాష్‌. కోవిడ్‌ సమయంలో ఇబ్బందులు పడుతున్న వారికి తన వంతు సాయాన్ని అందించిన ప్రణీత, ఖాళీ సమయంలో హార్స్‌ రైడింగ్‌ నేర్చుకుంది. అసలు ప్రణీత హార్స్‌ రైడింగ్‌ ఎందుకు నేర్చుకుంటుంది. తనేమైనా స్పోర్ట్స్‌ సినిమాలో నటిస్తుందా? అని కూడా కొందరు భావించారు. అయితే ఈ వార్తలకు ప్రణీత నవ్వేసి ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడం కోసమే తాను హార్స్‌ రైడింగ్‌ నేర్చుకున్నానని ప్రణీత చెప్పుకొచ్చింది. 


Updated Date - 2020-10-30T20:46:43+05:30 IST