ఓటీటీలో ‘ప్రణవం’
ABN , First Publish Date - 2020-08-08T06:37:03+05:30 IST
శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ నటీనటులుగా కుమార్ జి. దర్శకత్వంలో తనూజ ఎస్ నిర్మించిన చిత్రం ‘ప్రణవం’. నిర్మాణానంతర కార్యక్రమాలు...

శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ నటీనటులుగా కుమార్ జి. దర్శకత్వంలో తనూజ ఎస్ నిర్మించిన చిత్రం ‘ప్రణవం’. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీ ద్వారా విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘‘చక్కని ప్రేమకథతో థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ ఈ చిత్రంతో హీరోగా నిరూపించుకుంటాడు. ఇటీవల విడుదలైన పాటలకు స్పందన బావుంది. ఓటీటీ ద్వారా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.