‘హే భగవాన్... లైన్‌లో ఉండండి’... ప్రకాష్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2020-03-08T16:55:11+05:30 IST

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకులో భగవాన్ జగన్నాథ్(పూరీ జగన్నాథ ఆలయం)పేరుతో జమ అయిన రూ.545 కోట్ల మొత్తంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపధ్యంలో...

‘హే భగవాన్... లైన్‌లో ఉండండి’... ప్రకాష్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకులో భగవాన్ జగన్నాథ్(పూరీ జగన్నాథ ఆలయం)పేరుతో జమ అయిన రూ.545 కోట్ల మొత్తంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపధ్యంలో నటుడు ప్రకాష్‌రాజ్ ఈ ఉదంతంపై స్పందించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రకాష్‌రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో ‘హే భగవాన్, మిమ్మల్ని కూడా లైనులో నిలబెట్టారు. పూరీ జగన్నాథుని రూ. 545 కోట్ల మొత్తం ఎస్ బ్యాంకులో చిక్కుకుపోయిందుకు భక్తులు చింతిస్తున్నారు’ అని రాశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2020-03-08T16:55:11+05:30 IST