సోనూసూద్‌ను సత్కరించిన ప్రకాశ్‌ రాజ్‌

ABN , First Publish Date - 2020-09-28T20:01:41+05:30 IST

సోనూసూద్‌ను విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఈరోజు సత్కరించారు. అది కూడా షూటింగ్‌ లొకేషన్‌లో. వివరాల్లోకెళ్తే..

సోనూసూద్‌ను సత్కరించిన ప్రకాశ్‌ రాజ్‌

సోనూసూద్‌ను విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఈరోజు సత్కరించారు. అది కూడా షూటింగ్‌ లొకేషన్‌లో. వివరాల్లోకెళ్తే.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా సంతోష్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కతోన్న చిత్రం 'అల్లుడు అదుర్స్‌'. ఈ చిత్రంలో సోనూసూద్‌ కీలక పాత్రలోనటిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌.. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలతో రీస్టార్ట్‌ అయ్యింది. హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్‌లో సోనూసూద్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్‌ సమయంలో కొన్ని వేల మంది ప్రజలకు సాయం చేసిన సోనూసూద్‌ ప్రకాశ్‌రాజ్‌ ప్రత్యేకంగా సత్కరించారు. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కోవిడ్‌ సమయంలో ప్రకాశ్‌రాజ్‌ కూడా ప్రజలకు తన వంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అల్లుడు అదుర్స్‌ చిత్రంలో నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 


Updated Date - 2020-09-28T20:01:41+05:30 IST