నటి ప్రగతితో పెట్టుకోవద్దురోయ్‌..

ABN , First Publish Date - 2020-12-01T03:25:46+05:30 IST

నటి ప్రగతి రఫ్ఫాడించేస్తోంది. ఈ లాక్‌డౌన్‌లో అందరినీ ఎంటర్‌టైన్‌ చేసిన వారిలో నటి ప్రగతి కూడా ఒకరు. ఆమె తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్‌ చేసిన డ్యాన్స్‌లు, ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్న

నటి ప్రగతితో పెట్టుకోవద్దురోయ్‌..

నటి ప్రగతి రఫ్ఫాడించేస్తోంది. ఈ లాక్‌డౌన్‌లో అందరినీ ఎంటర్‌టైన్‌ చేసిన వారిలో నటి ప్రగతి కూడా ఒకరు. ఆమె తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్‌ చేసిన డ్యాన్స్‌లు, ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్న వీడియోలు ఏ విధంగా వైరల్‌ అయ్యాయో తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు ఎంటర్‌టైన్‌ చేస్తూ వచ్చిన ప్రగతి.. ఇప్పుడు సడెన్‌గా రఫ్ఫాడించేస్తోంది. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ కింది వీడియో చూడాల్సిందే. చూశారుగా.. కర్రసాముతో ప్రగతి ఎలా రెచ్చిపోయింది. అందుకే ఆమెతో చాలా జాగ్రత్త అని చెప్పేది. డ్యాన్స్‌, ఎక్స్‌ర్‌సైజులతో అలరించింది కదా.. అని దగ్గరకి వస్తే.. తాట తీస్తా.. అనే విధంగా ప్రొఫెషనల్‌లా కర్రసాముతో కుమ్మేస్తోంది. డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌ అంటూ ఆమె కర్రసాము చేస్తున్న వీడియో చూసిన వారంతా.. మరో రాములమ్మ వస్తుందిరోయ్‌.. ఆమెతో పెట్టుకోవద్దురోయ్‌.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారంటే ఏ రేంజ్‌లో ప్రగతి ఫైట్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.Updated Date - 2020-12-01T03:25:46+05:30 IST

Read more