‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సెన్సార్ టాక్

ABN , First Publish Date - 2020-03-04T00:33:15+05:30 IST

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న

‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సెన్సార్ టాక్

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకుడు. అమృతా అయ్యర్ నాయిక. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ఒక దృశ్యకావ్యంగా ఉందని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు చిత్ర బృందం తెలిపింది.


ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ‘నీలి నీలి ఆకాశం’ సంగీత ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తూ పెద్ద సక్సెస్ అయిన విషయం తెలిసిందే. యూట్యూబ్‌లో ఇప్పటికి 50 మిలియన్ వ్యూస్ ఆ పాట సాధించింది. ఒక చిన్న సినిమా పాట ఈ స్థాయిలో పాపులర్ కావడం మాములు విషయం కాదు. సంగీత ప్రియులు ఈ పాటను ఈ స్థాయిలో ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని నిర్మాత ఎస్వీ బాబు తెలిపారు. ఈ చిత్రంలో హీరో ప్రదీప్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉండి అలరిస్తాయని ఆయన పేర్కొన్నారు. 


అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ సినిమా ప్రధాన ఆకర్షణ అవుతాయని, దర్శకునికి ఇది తొలి సినిమా అయినప్పటికీ ఒక దృశ్య కావ్యంలా చిత్రాన్ని రూపొందించారని, లవ్ ఎంటర్‌టైనర్‌గా సినిమా అలరిస్తుందని తెలిపిన ఆయన.. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు.

Updated Date - 2020-03-04T00:33:15+05:30 IST

Read more