మాస్క్‌ పెట్టుకుని థియేటర్‌కు రండి: ప్రభాస్

ABN , First Publish Date - 2020-12-25T04:18:57+05:30 IST

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను ఏ విధంగా కుదిపేసిందో తెలియంది కాదు. ఒక్క సినీ పరిశ్రమ అనే కాదు.. అన్ని ఇండస్ట్రీస్‌, ప్రజలు కరోనాతో ఎంతో కోల్పోయారు. వ్యాక్సిన్‌

మాస్క్‌ పెట్టుకుని థియేటర్‌కు రండి: ప్రభాస్

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను ఏ విధంగా కుదిపేసిందో తెలియంది కాదు. ఒక్క సినీ పరిశ్రమ అనే కాదు.. అన్ని ఇండస్ట్రీస్‌, ప్రజలు కరోనాతో ఎంతో కోల్పోయారు. వ్యాక్సిన్‌ వస్తుందనే మాట వినబడుతుంది కానీ.. ఎప్పుడు అనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇక కరోనా లాక్‌డౌన్‌తో కొన్ని నెలలుగా మూత పడిన థియేటర్లకు రీసెంట్‌గానే మోక్షం లభించింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్లు రన్‌ చేయాలని ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. డిసెంబర్‌ 25 సాయితేజ్‌ నటించిన సోలో బ్రతుకే సో బెటర్‌ చిత్రంతో పూర్తిగా అంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల థియేటర్లు తెరుచుకుంటున్నాయి. కరోనా వైరస్ ఉన్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ రీ ఓపెన్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ హీరోలు థియేటర్స్ ఓపెనింగ్ గురించి తమదైన తరహాలో పిలుపు అందిస్తున్నారు. అందరూ బిగ్ స్క్రీన్ వైపు రావాలి అంటూ ప్రేక్షకులను కోరుతున్నారు. 


ఈ క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రేక్షకులు జాగ్రత్తలు పాటిస్తూ.. థియేటర్‌కు వచ్చి సినిమాని నిలబెట్టాలని కోరుతూ.. ఓ వీడియోని విడుదల చేశాడు. 'మళ్లీ థియేటర్స్ కు వద్దాం.. బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ చేద్దాం' అంటూ ప్రభాస్ వీడియో రూపంలో అభిమానులకు తెలిపాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్స్ లో కూడా కరోనా నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని థియేటర్లలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ప్రేక్షకులు కూడా మాస్కు పెట్టుకొని వచ్చి బిగ్ స్క్రీన్ అనుభవం మళ్లీ పొందండి అంటూ ప్రభాస్ పిలుపునిచ్చాడు.Updated Date - 2020-12-25T04:18:57+05:30 IST