బుల్లితెరపైనా.. అలరించలేకపోయిన ‘సాహో’

ABN , First Publish Date - 2020-10-30T01:52:54+05:30 IST

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా 'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'సాహో'. 'బాహుబలి' రెండు పార్ట్‌ల తర్వాత రిలీజ్‌ అవుతుండటంతో

బుల్లితెరపైనా.. అలరించలేకపోయిన ‘సాహో’

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా 'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'సాహో'. 'బాహుబలి' రెండు పార్ట్‌ల తర్వాత రిలీజ్‌ అవుతుండటంతో.. విడుదలయ్యే సమయంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందు మాములుగా మొదలైన ఈ చిత్రం బాహుబలి సాధించిన అఖండ విజయంతో.. పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా మారిపోయింది. భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం ఒక్క బాలీవుడ్‌లో మినహా మిగతా అన్ని చోట్ల అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. చివరికి వెండితెరపై ఈ సినిమా పరాజయం పాలైన చిత్రంగానే బాక్సాఫీస్‌ రిపోర్ట్స్‌ వచ్చాయి.


ఇక తాజాగా ఈ చిత్రాన్ని బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్‌ షోగా ప్రసారం చేశారు. వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం బుల్లితెరపైనైనా రికార్డులు క్రియేట్‌ చేస్తుందని.. ప్రభాస్‌ అభిమానులు భావించారు. కానీ చిన్న స్క్రీన్‌పై కూడా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. స్టార్‌ హీరోల సినిమాలు మూడోసారి, నాలుగో సారి బుల్లితెరపై ప్రసారం అయితే ఎటువంటి టీఆర్పీ రేటింగ్స్‌ వస్తాయో.. అలాంటి టీఆర్పీని కూడా ఈ చిత్రం సాధించలేకపోయింది. ఈ చిత్రానికి వచ్చిన టీఆర్పీ చూసి ప్రభాస్‌ అభిమానులే కాదు.. ప్రసారం చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ వారు కూడా షాకవ్వడం విశేషం. ఈ చిత్రం 5.8 టిఆర్‌పి రేటింగ్‌ సాధించి.. బుల్లితెరపై కూడా పరాజయాన్ని చవిచూసిందనే వార్తలు బయటికి వచ్చాయి.

Updated Date - 2020-10-30T01:52:54+05:30 IST