నెట్టింట వైరల్‌ అవుతున్న 'రాధేశ్యామ్‌' ఫొటోస్‌

ABN , First Publish Date - 2020-10-28T00:22:11+05:30 IST

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్‌'. జిల్‌ చిత్ర ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం

నెట్టింట వైరల్‌ అవుతున్న 'రాధేశ్యామ్‌' ఫొటోస్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్‌'. జిల్‌ చిత్ర ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇటలీలో షూటింగ్‌ జరుపుకుంటోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన బ్రేక్‌ అనంతరం ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ని ప్రభాస్‌ బర్త్‌డే కానుకగా.. అక్టోబర్‌ 23న విడుదల చేసిన విషయం తెలిసిందే. బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌ పేరుతో విడుదలైన ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. తాజాగా రాధేశ్యామ్‌ చిత్రానికి సంబంధించిన ప్రభాస్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


కొరియోగ్రాఫర్‌ వైభవి మర్చంట్‌ ఇటలీలో ప్రభాస్‌తో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా షేర్‌ చేయగా.. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. బర్త్‌డే రోజు తన అభిమానులకు దూరంగా ఉన్నప్పటికీ.. ఇలా ఫొటోలతో దర్శనమిచ్చి.. వారందరినీ సంతోషపరిచాడు ప్రభాస్‌. అభిమానులు కూడా ప్రభాస్‌ ఫొటో ఏది కనిపించినా వైరల్‌ చేస్తూ.. వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ రాధేశ్యామ్‌తో పాటు నాగ్‌ అశ్విన్‌ ఫిల్మ్‌, ఓం రౌత్‌తో 'ఆదిపురుష్‌' చిత్రాలు చేస్తున్నారు.Updated Date - 2020-10-28T00:22:11+05:30 IST