ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు!

ABN , First Publish Date - 2020-11-06T20:17:32+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ కోసం ఇటలీలో ఉన్నాడు.

ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ కోసం ఇటలీలో ఉన్నాడు. ప్రభాస్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. `బాహుబలి`తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇటలీలో కూడా ప్రభాస్ తన స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.  


ఇటలీలోని కొన్ని మీడియా సంస్థలు ప్రభాస్ గురించి ప్రత్యేక కథనాలు రాశాయి. ప్రభాస్ ఇంటర్వ్యూల కోసం క్యూ కడుతున్నాయి. ప్రభాస్‌తో ఫొటోలు దిగేందుకు పలువురు ఇటాలియన్లు ఎగబడుతున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇటలీలో ప్రభాస్ తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో మారాయి. 

Updated Date - 2020-11-06T20:17:32+05:30 IST