ఇటలీలో ప్రభాస్ మేనియా!

ABN , First Publish Date - 2020-10-30T16:11:28+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ కోసం ఇటలీలో ఉన్నాడు.

ఇటలీలో ప్రభాస్ మేనియా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ కోసం ఇటలీలో ఉన్నాడు. 1980 బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇటలీలో ప్రత్యేక సెట్లను వేశారు. దాంతో స్థానికులు కూడా ఈ సినిమా షూటింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు గురించి తెలిసిందే.


దీంతో `రాధేశ్యామ్` ఇటాలియన్లను కూడా ఆకర్షిస్తోంది. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు `రాధేశ్యామ్` గురించి ప్రత్యేక కథనాలను ఇచ్చాయి. ప్రభాస్ ఇమేజ్ గురించి, `రాధేశ్యామ్` కాస్ట్యూమ్స్, సెట్స్ డిజైనింగ్ గురించి రాశాయి.  ప్రభాస్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాయి. లాక్‌డౌన్ టైమ్ తర్వాత ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి సినిమా ఇదే కావడం కూడా వారి ఆసక్తికి ఒక కారణం. 

Updated Date - 2020-10-30T16:11:28+05:30 IST