'రాధేశ్యామ్‌'లో ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్

ABN , First Publish Date - 2020-10-21T19:09:58+05:30 IST

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు(అక్టోబర్‌ 23) సందర్భంగా ఆయన లేటెస్ట్‌ మూవీ 'రాధేశ్యామ్‌'లో ఆయన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'రాధేశ్యామ్‌'లో ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు(అక్టోబర్‌ 23) సందర్భంగా ఆయన లేటెస్ట్‌ మూవీ 'రాధేశ్యామ్‌'లో ఆయన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమాలో ప్రభాస్‌ పాత్ర పేరు విక్రమాదిత్య. ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌ చూసిన ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం  సినిమా ఇటలీలో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన 'బీట్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌'ను అక్టోబర్‌ 23న విడుదల చేస్తున్నారు.  జగపతిబాబు, భాగ్యశ్రీ, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జీ, ముర‌ళీ శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 


Updated Date - 2020-10-21T19:09:58+05:30 IST