ప్రభాస్ ఫస్ట్.. విజయ్ నెక్స్ట్!

ABN , First Publish Date - 2020-04-16T16:40:16+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియా హవా బాగా నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు

ప్రభాస్ ఫస్ట్.. విజయ్ నెక్స్ట్!

ప్రస్తుతం సోషల్ మీడియా హవా బాగా నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌కు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరిగింది. అనేక మంది సెలబ్రిటీలు కూడా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కలిగి ఉన్నారు.


తెలుగు హీరోల్లో ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక సార్లు ప్రస్తావన పొందిన తెలుగు హీరోల్లో ప్రభాస్ అగ్ర స్థానంలో నిలిచాడు. ప్ర‌భాస్ పేరును ట్యాగ్ చేస్తూ పది లక్షలకు పైగా పోస్టులు ప్రచురితం అయ్యాయట. ఇక, ప్రభాస్ తర్వాతి స్థానంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడు. విజ‌య్ పేరును ప్రస్తావిస్తూ దాదాపు 9 ల‌క్ష‌ల‌కు పైగా పోస్టులు ప‌డ్డాయట. ఇక, నాని, అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేస్తూ 8 లక్షలు, సూపర్‌స్టార్ మహేష్‌ను ప్రస్తావిస్తూ 7 లక్షలకుపైగా పోస్టులు ప్రచురితం అయ్యాయట. 

Updated Date - 2020-04-16T16:40:16+05:30 IST

Read more