సౌత్‌లో ప్రభాస్ నంబర్ వన్

ABN , First Publish Date - 2020-06-08T00:13:37+05:30 IST

స్టార్స్‌కు.. ఫ్యాన్స్‌కు మధ్య అనుసంధాన కర్తగా మారింది సోషల్ మీడియా. అందుకే మన స్టార్స్‌ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌..

సౌత్‌లో ప్రభాస్ నంబర్ వన్

స్టార్స్‌కు.. ఫ్యాన్స్‌కు మధ్య అనుసంధాన కర్తగా మారింది సోషల్ మీడియా. అందుకే మన స్టార్స్‌ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌పై మనసు పారేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమ విషయాలను సామాజిక వేదికల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. అలాగే అభిమానుల అంతర్గతాన్ని నేరుగా తెలుసుకోవడం కోసం కూడా ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇదిలా ఉంటే సామాజిక వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో అరుదైన ఘనత సాధించాడు ప్రభాస్. ఫేస్‌బుక్‌లో తాజాగా 14 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించి దక్షిణాదిన ఈ ఘనత సాధించిన తొలి హీరోగా నిలిచాడు.


ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌ లిస్టులో ప్రభాస్ తర్వాతి స్థానంలో 13.1 మిలియన్ల ఫాలోవర్స్‌తో అల్లు అర్జున్ నిలిచాడు. ఇక 7.97 మిలియన్ల ఫాలోవర్స్‌తో మహేశ్, 7.1 మిలియన్ల ఫాలోవర్స్‌‌తో రామ్‌ చరణ్, 5.2 మిలియన్ల ఫాలోవర్స్‌‌తో నాని వంటి తెలుగు హీరోలు ఉన్నారు. అయితే ఫేస్‌బుక్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ప్రభాస్.. ట్విట్టర్‌లో మాత్రం కేవలం 1.5 మిలియన్ల ఫాలోవర్స్‌‌ను మాత్రమే సంపాదించాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో యంగ్‌రెబెల్ స్టార్‌‌కి 4.6 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇలా మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాలోనూ పాన్ ఇండియా స్టార్ అని నిరూపించుకుంటున్నాడు ప్రభాస్. అయితే ఫేస్ బుక్ ఫాలోవర్స్‌లో ప్రభాస్ కి ఆ తర్వాత స్థానంలో ఉన్న బన్నీకి ఒక మిలియన్ మాత్రమే వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో మునుముందు వీరిద్దరి మధ్య ఫాలోవర్స్ పోటీ ఎలా కొనసాగుతుందో చూద్దాం.

Updated Date - 2020-06-08T00:13:37+05:30 IST