నా కల నిజం కాబోతోంది: ప్రభాస్

ABN , First Publish Date - 2020-10-09T16:15:45+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, `మహానటి` డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.

నా కల నిజం కాబోతోంది: ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, `మహానటి` డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో మెగా అప్‌డేట్ వచ్చింది. 


ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారు. `లెజెండ్ అమితాబ్ బచ్చన్ లేకుండా లెజెండరీ సినిమాను ఎలా తెరకెక్కించగలం` అని వైజయంతీ మూవీస్ సంస్థ పేర్కొంది. అమితాబ్‌తో కలిసి నటిస్తుండడం పట్ల ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశాడు. `ఎట్టకేలకు నా కల నిజం కాబోతోంది. దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించబోతున్నాన`ని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నాడు. Updated Date - 2020-10-09T16:15:45+05:30 IST