శ్రీరాముడిగా ప్రభాస్‌!

ABN , First Publish Date - 2020-08-19T05:47:16+05:30 IST

‘బాహుబలి’గా ప్రపంచవ్యాప్తంగా అలరించిన ప్రభాస్‌ ఇప్పుడు రాముడిగా అలరించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఆయన నటించబోతున్న 22వ సినిమా ‘ఆది పురుష్‌’. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ ఈ చిత్రానికి దర్శకుడు...

శ్రీరాముడిగా ప్రభాస్‌!

‘బాహుబలి’గా ప్రపంచవ్యాప్తంగా అలరించిన ప్రభాస్‌ ఇప్పుడు రాముడిగా అలరించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఆయన నటించబోతున్న 22వ సినిమా ‘ఆది పురుష్‌’. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ ఈ చిత్రానికి దర్శకుడు. టీ సిరీస్‌ భూషణ్‌కుమార్‌, క్రిషన్‌ కుమార్‌ నిర్మాతలు. మంగళవారం ఈ సినిమా టైటిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రభాస్‌ వెల్లడించారు. ‘చెడుపై మంచి విజయం సాధించినందుకు సంబరాలు’ అంటూ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను ఆయన అభిమానులతో పంచుకున్నారు. పోస్టర్‌లో రాముడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఉండగా, పది తలల రావణుడు, గదతో దూసుకొస్తున్న హనుమంతుడు ఇలా ఇతిహాసగాథ రామాయణాన్ని తలపించేలా పోస్టర్‌ను  తీర్చిదిద్దారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ డబ్బింగ్‌ చేయనున్నారు. 2021లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022 విడుదల చేస్తారు. ‘‘ప్రభాస్‌ని తెరపై రాముడిలా చూడబోతుండడం ఎగ్జైటింగ్‌గా ఉంది. గతంలో కొంతమంది నటులు మాత్రమే ఆ పాత్రను చేయగలిగారు’ అని ప్రభాస్‌ 21వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న నాగ్‌ అశ్విన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-19T05:47:16+05:30 IST