ప్రభాస్ రూ.కోటిన్నర విరాళం!

ABN , First Publish Date - 2020-10-21T01:21:02+05:30 IST

ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి.

ప్రభాస్ రూ.కోటిన్నర విరాళం!

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా తామూ ఉన్నామంటూ టాలీవుడ్‌ సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు తమ వంతు సహాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. 


తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చాడు. తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-10-21T01:21:02+05:30 IST