ప్రభాస్‌ దత్తత తీసుకున్న ప్రాంత వివరాలివే..

ABN , First Publish Date - 2020-09-07T23:25:25+05:30 IST

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మొక్కలు నాటడమే కాకుండా.. ఓ రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. చెప్పి

ప్రభాస్‌ దత్తత తీసుకున్న ప్రాంత వివరాలివే..

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మొక్కలు నాటడమే కాకుండా.. ఓ రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ప్రభాస్‌ సోమవారం దుండిగల్‌ సమీపంలోని ఖాజీపల్లి అర్బన్‌ ఫారెస్ట్ బ్లాక్‌ను దత్తత తీసుకున్నారు. అంతేకాదు ఖాజీపల్లి అర్బన్‌ ఫారెస్ట్ పార్క్‌కు శంఖుస్థాపన కూడా చేశారు.


ప్రభాస్‌ డేరింగ్‌ స్టెప్‌

ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో దత్తతకు ముందుకు వచ్చిన ప్రభాస్‌.. దాదాపు 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుని డేరింగ్‌ స్టెప్‌ వేశారు. తన తండ్రి యు.వి.ఎస్‌. రాజు పేరు మీద ఈ అర్బన్‌ పార్క్‌ను ప్రభాస్‌ రూపొందించనున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి రానుంది. ఈ అటవీ ప్రాంత అభివృద్దికి దాదాపు రెండు కోట్ల రూపాయలను ప్రభాస్‌ ఖర్చు చేయనున్నారు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లుగా ప్రభాస్‌ తెలిపారు. ఇక ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో ప్రభాస్‌తో పాటు ఎంపీ సంతోష్‌ కుమార్‌, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-07T23:25:25+05:30 IST