ఫిబ్రవరి నుంచి ‘పవర్‌పేట’ మొదలు!
ABN , First Publish Date - 2020-10-12T07:25:35+05:30 IST
నితిన్ కథానాయకుడిగా నటించనున్న ‘పవర్ పేట’ చిత్రీకరణ ఫిబ్రవరి నుంచి మొదలు కానుందని తెలిసింది. గేయ రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణచైతన్య...

నితిన్ కథానాయకుడిగా నటించనున్న ‘పవర్ పేట’ చిత్రీకరణ ఫిబ్రవరి నుంచి మొదలు కానుందని తెలిసింది. గేయ రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణచైతన్య రెండు భాగాలుగా ఈ పీరియడ్ పొలిటికల్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తన పాత్ర రీత్యా నితిన్ వివిధ వయసుల్లో కనిపించనున్నారు. ‘రంగ్ దే’లో అతనికి జోడీగా నటిస్తున్న కీర్తీ సురేశ్, ఈ చిత్రంలోనూ కథానాయిక. మార్చి నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. ఏలూరు, రాజమండ్రి, మైసూర్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సెట్ కూడా వేస్తారట. ప్రస్తుతం మణిశర్మ సారథ్యంలో సంగీత చర్చలు ప్రారంభ మయ్యాయి. ‘పవర్ పేట’ చిత్రీకరణ ప్రారంభించడానికి ముందే ‘రంగ్ దే’, ‘చెక్’ చిత్రాలు పూర్తి చేయనున్నారు. ఇవి కాకుండా ‘అంధాధున్’ రీమేక్‌లో నితిన్ నటించనున్న సంగతి తెలిసిందే.