ధ్రువ సర్జా దంపతులకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-16T05:04:29+05:30 IST

కన్నడ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా , ఆయన భార్య ప్రేరణా శంకర్‌కు కొవిడ్‌ - 19 టెస్టులు చేయించగా, పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా...

ధ్రువ సర్జా దంపతులకు పాజిటివ్‌

కన్నడ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా , ఆయన భార్య ప్రేరణా శంకర్‌కు కొవిడ్‌ - 19 టెస్టులు చేయించగా,  పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ధ్రువ సర్జా వెల్లడించారు. ‘నాతో పాటు నా భార్యకు కరోనా టెస్టులు చేయిస్తే పాజిటివ్‌ అని తెలిసింది. అయితే తక్కువ లక్షణాలు ఉన్నాయి. అయినా మేం ఆసుపత్రిలో చేరాం. త్వరగా కోలుకుంటామనే నమ్మకం ఉంది. ఈ మధ్య మమ్మల్ని కలసిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఇప్పటికే ధ్రువ సోదరుడు చిరంజీవి  సర్జా ఆకస్మికంగా మరణించడంతో విషాదంలో ఉన్న వారి కుటుంబానికి ఇది మరో షాక్‌ అని చెప్పాలి. ధ్రువ తల్లితండ్రులకు, చిరంజీవి భార్య మేఘనకు కరోనా టెస్టులు చేయాల్సి ఉంది. 30 ఏళ్ల వయసు కలిగిన ధ్రువ చిరకాలంగా తను ప్రేమిస్తున్న ప్రేరణా శంకర్‌ను గత నవంబర్‌లో పెళ్లి చేసుకొన్నారు. 

ఆంధ్రజ్యోతి, బెంగళూరు

Updated Date - 2020-07-16T05:04:29+05:30 IST