శిష్యుడికి పోసాని సపోర్ట్
ABN , First Publish Date - 2020-12-25T00:51:41+05:30 IST
తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం

తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'జి.ఎస్.టి' (గాడ్, సైతాన్, టెక్నాలజీ). ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ వినూత్నంగా స్మశానంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ''తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌పై నిర్మితమవుతోన్న 'జి.ఎస్.టి' చిత్రాన్ని నా శిష్యుడు జానకిరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్‌గా మారి అతను చేస్తున్న ఈ మొదటి చిత్ర టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రేక్షకులు ఈ చిత్రానికి మంచి సక్సెస్ అందించాలని కోరుతున్నాను. జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కి నా అభినందనలు తెలియజేస్తున్నాను..'' అని తెలపగా.. ''మా చిత్ర టీజర్‌ని విడుదల చేసిన మా గురువుగారైన పోసాని కృష్ణమురళిగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజంలో ఎంతో మందికి దేవుడి పైన, దెయ్యం పైన, సైన్స్ పైన ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు వున్నాయి. వాటన్నిటికీ ఈ సినిమా సమాధానం చెప్పేదిగా ఉంటుంది.. '' అని దర్శకుడు జానకిరామ్ అన్నారు.
Read more