ఛాలెంజింగ్ రోల్‌లో పూర్ణ

ABN , First Publish Date - 2020-10-12T23:05:09+05:30 IST

నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ 'బ్యాక్ డోర్' పేరుతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ కథానాయకి పూర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న

ఛాలెంజింగ్ రోల్‌లో పూర్ణ

నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ 'బ్యాక్ డోర్' పేరుతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ కథానాయకి పూర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ విభిన్న కథా చిత్రాన్ని.. 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నేడు (12-10-2020) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత, హీరోయిన్‌ పూర్ణ ఈ చిత్రం గురించి తెలియజేశారు.


"బ్యాక్ డోర్" ఎంట్రీ అన్నది ఈరోజుల్లో అన్ని రంగాల్లో చాలా కామన్ అయిపోయింది. అటువంటి ఓ ప్రత్యేకమైన "బ్యాక్ డోర్" ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ వినూత్న చిత్రం హీరోయిన్ పూర్ణ కెరీర్ లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది" అని అన్నారు దర్శకుడు కర్రి బాలాజీ. 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... 'త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. శర వేగంతో షూటింగ్ పూర్తి చేసేందుకు మా దర్శకుడు కర్రి బాలాజీ అన్ని సన్నాహాలు చేస్తున్నారు" అని అన్నారు. చాలా రోజుల తర్వాత ఓ ఛాలెంజింగ్ రోల్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు.Updated Date - 2020-10-12T23:05:09+05:30 IST

Read more