పెళ్లికి సిద్ధమైన పూనమ్ పాండే
ABN , First Publish Date - 2020-07-27T14:50:08+05:30 IST
బాలీవుడ్ నటి పూనమ్ పాండే దర్శకుడు సామ్ బాంబేతో చాలా కాలంగా ప్రేమలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే ఓ ఇంటివారు కానున్నారు.
బాలీవుడ్ నటి పూనమ్ పాండే దర్శకుడు సామ్ బాంబేతో చాలా కాలంగా ప్రేమలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే ఓ ఇంటివారు కానున్నారు. వీరి బంధం మరో అడుగు ముందుకు పడింది. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. సామ్‌బాంబే, పూనమ్ పాండే నిశ్చితార్థపు ఉంగరాలున్న ఫొటోను సామ్‌బాంబే తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తమ జీవితంలో మధుర క్షణాలు అంటూ పూనమ్ ఫొటోను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మరి వీరి పెళ్లి ఎప్పుడు? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం పూనమ్‌పాండే ‘నషా’ సీక్వెల్‌లో నటిస్తున్నారు.
Read more