ప్రముఖ మోడల్, సినీనటి పూనం పాండేపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2020-05-11T12:51:00+05:30 IST

ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనం పాండేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.....

ప్రముఖ మోడల్, సినీనటి పూనం పాండేపై పోలీసు కేసు

ముంబై : ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనం పాండేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్ నిబంధనలను పూనం పాండే ఉల్లంఘించి తన బీఎండబ్ల్యూ కారులో మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పూనం పాండేపై ముంబై పోలీసులు ఐపీసీ సెక్షన్ 188, 269, 51 (బి) ల కింద కేసు నమోదు చేసి బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు. పూనం పాండేతో పాటు శామ్ అహ్మద్ బాంబేపై కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు ఇన్ స్పెక్టరు మృత్యుంజయ్ హీరేమత్ చెప్పారు. పూనం పాండే గతంలో ప్రముఖనటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాంబే హైకోర్టులో ఫిర్యాదు చేశారు. పూనం పాండే నషా, ఆగయా హీరో, ద జర్నీ ఆఫ్ కర్మ సినిమాల్లో నటించారు. 

Updated Date - 2020-05-11T12:51:00+05:30 IST