ఏదో ఒక రోజు ఆమెను కలుస్తా: పూజ
ABN , First Publish Date - 2020-11-10T18:15:22+05:30 IST
ఓ చిన్నారి ప్రశంసకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ఉబ్బితబ్బిబ్బవుతోంది.
ఓ చిన్నారి ప్రశంసకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ఉబ్బితబ్బిబ్బవుతోంది. త్వరలోనే ఆ చిన్నారిని కలవాలని ఊవిళ్లూరుతోంది. పూజ గురించి ఓ చిన్నారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. `నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? పెద్దయ్యాక ఏమవుతావు` అని ఆ వీడియోలో ఓ వ్యక్తి బాలికను ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నకు స్పందించిన బాలిక.. `నేను పెద్దయ్యాక పూజా హెగ్డేనవుతా. పూజ చాలా అందంగా ఉంటుంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం` అని పేర్కొంది. ఈ వీడియోను చూసిన పూజ రీ ట్వీట్ చేసింది. `ఓ మైగాడ్.. ఈ చిన్నారి వీడియో నా రోజును పరిపూర్ణం చేసింది. ఆమె బుగ్గలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఆమెకు నా ప్రేమను, ముద్దులను ఈ ట్వీట్ ద్వారా పంపిస్తున్నా. ఏదో ఒకరోజు ఆమెను కలుస్తాన`ని పూజ కామెంట్ చేసింది.