కమల్‌హాసన్‌తో రిలేషన్ గురించి పూజ స్పందన!
ABN , First Publish Date - 2020-05-25T22:13:09+05:30 IST
హీరోయిన్ గౌతమి నుంచి విడిపోయిన తర్వాత నటి పూజా కుమార్‌తో కమల్ హాసన్ సహజీవనం సాగిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్ గౌతమి నుంచి విడిపోయిన తర్వాత నటి పూజా కుమార్‌తో కమల్ హాసన్ సహజీవనం సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతేడాది జరిగిన కమల్ పుట్టిన రోజు వేడుకల్లో పూజ స్వయంగా అన్ని ఏర్పాట్లూ చేయడం, కమల్ ఫ్యామిలీ ఫొటోలో ఆమె ఉండడం ఈ వార్తలకు కారణం. ఇటీవలి కాలంలో కమల్ నటించిన చాలా సినిమాల్లో పూజ కూడా నటించింది.
తాజాగా పూజ ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌తో రిలేషన్ గురించి మాట్లాడింది. `గత ఐదారేళ్లుగా నేను కమల్ సార్‌తో కలిసి పనిచేస్తున్నా. ఆయన ఒక గొప్ప క్రియేటర్. క్రియేటివ్ జీనియస్. ఎన్నో విషయాలను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులు, కూతుళ్లతో కూడా నాకు మంచి అనుబంధముంది. అయితే, కమల్‌తో నేను రిలేషన్‌లో ఉన్నానని ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. అవన్నీ అబద్ధాలు. నేను కమల్‌తో రిలేషన్‌లో లేన`ని పూజ వెల్లడించింది.