అదే టాలీవుడ్ గొప్పతనం: పూజా హెగ్డే

ABN , First Publish Date - 2020-11-06T20:27:33+05:30 IST

పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు మూవీ లవర్స్‌ గురించి ఓ ఉత్తరాది వ్యక్తి దగ్గర ఆకాశానికెత్తేసింది.

అదే టాలీవుడ్ గొప్పతనం:  పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరు? అంటే వెంటనే వినిపించే పేరు పూజాహెగ్డే. స్టార్‌ హీరోలతో వరుస సినిమాల్లో నటిస్తూ అగ్ర కథానాయిక రేసులో దూసుకెళ్తోంది. ఒకవైపు టాలీవుడ్‌ సినిమాలతో పాటు బాలీవుడ్‌ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు మూవీ లవర్స్‌ గురించి ఓ ఉత్తరాది వ్యక్తి దగ్గర ఆకాశానికెత్తేసింది. పూజాహెగ్డే మాటలు విని షాకవడం ఎదుటి వ్యక్తి వంతైంది. "తెలుగు ప్రేక్షకులు సినిమాలను అమితంగా ప్రేమిస్తారు. స్టార్స్‌ను దేవుళ్లుగా పూజిస్తారు. ఓ తెలుగు సినిమా రెండు రాష్ట్రాల్లో రూ.150 కోట్లు, రూ.200 కోట్లను వసూళ్లు చేస్తున్నాయంటే కారణం ప్రేక్షకులే. ఓ సినిమాను చాలా ఇష్టపడి పదేపదే చూస్తారు. నేను సినిమా విడుదలైన రోజున సినిమాను చూడటానికి ఇష్టపడతారు. సినిమాను, స్టార్స్‌ను ఎంతగా ప్రేమిస్తారంటే థియేటర్‌కు పెద్ద పెద్ద డ్రమ్స్‌తో వస్తారు. డాన్సులేస్తారు. పేపర్లు చల్లుతారు. సినిమా అంటే వాళ్లకి ఓ పండుగే"అని చెప్పడమే కాకుండా నటిగా తనని తాను నిరూపించుకోవడానికి, తెలియని విషయాలను తెలుసుకోవడానికి టాలీవుడ్‌ ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పి తెలుగు సినిమాపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది పూజాహెగ్డే. 

Updated Date - 2020-11-06T20:27:33+05:30 IST