`రాధేశ్యామ్` నుంచి మరో సర్‌ప్రైజ్ అంటున్న పూజ!

ABN , First Publish Date - 2020-10-21T02:38:00+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, పూజాహెగ్డే కాంబినేష‌న్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం `రాధేశ్యామ్‌`.

`రాధేశ్యామ్` నుంచి మరో సర్‌ప్రైజ్ అంటున్న పూజ!

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, పూజాహెగ్డే కాంబినేష‌న్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం `రాధేశ్యామ్‌`. అత్యంత భారీ బడ్జెట్‌తో యూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ‌ కుమార్ డైరెక్ట‌ర్. ఈ నెల 23న ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. 


తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే  సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. `హాయ్.. నేను `రాధేశ్యామ్` సెట్‌లో ఉన్నాను. రేపు మీ కోసం పెద్ద సర్‌ప్రైజ్ రాబోతోంది. అప్ప‌టివ‌ర‌కు వేచి ఉండండి` అంటూ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. Updated Date - 2020-10-21T02:38:00+05:30 IST