హైదరాబాద్‌లో కలుద్దాం ప్రభాస్: పూజ
ABN , First Publish Date - 2020-11-04T17:52:20+05:30 IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం `రాధే శ్యామ్`.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం `రాధే శ్యామ్`. లాక్‌డౌన్ తరవాత గత నెలలో చిత్ర యూనిట్ ఇటలీ పయనమైంది. ప్రభాస్, పూజతోపాటు టీమ్ అంతా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. సుమారు నెల రోజులపాటు అక్కడ షూటింగ్‌లో పాల్గొన్న పూజ తాజాగా భారత్‌కు తిరిగి వచ్చింది.
తాను ఇటలీ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్నట్టు పూజ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలిపింది. `రాధే శ్యామ్ ఇటాలియన్ షెడ్యూల్‌ను పూర్తిచేశాను. ఈ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్‌కు ధన్యవాదాలు. హైదరాబాద్‌లో కలుద్దాం ప్రభాస్` అని పూజ పేర్కొంది. ఈ సినిమాతో పాటు అక్కినేని అఖిల్ `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` సినిమాలో కూడా పూజ హీరోయిన్‌గా నటిస్తోంది.
