‘ఇండియన్‌-2’ షూటింగ్‌ ప్రమాదం: కమల్‌, శంకర్‌కు సమన్లు

ABN , First Publish Date - 2020-02-21T17:49:53+05:30 IST

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇండియన్-2’ షూటింగ్ సెట్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే...

‘ఇండియన్‌-2’ షూటింగ్‌ ప్రమాదం: కమల్‌, శంకర్‌కు సమన్లు

చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇండియన్-2’ షూటింగ్ సెట్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అవ్వడంతో ముగ్గురు టెక్నీషియన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి పైగా గాయాలయ్యాయి.


కేసులు, సమన్లు!

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నారు. నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాతలు, క్రేన్‌ యజమాని, ఆపరేటర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నటుడు కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌కు సమన్లు జారీచేశారు. కాగా.. ఈ సమన్లపై ఇంతవరకూ కమల్, శంకర్ రియాక్ట్ అవ్వలేదు.

Updated Date - 2020-02-21T17:49:53+05:30 IST